calender_icon.png 16 July, 2025 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిగాచి కార్మికులకు న్యాయం చేయాలి

16-07-2025 12:26:28 AM

  1. మరణించిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు 
  2. క్షతగాత్రులకు 50 లక్షలు చెల్లించాలి 
  3. సిగాచి పరిశ్రమ దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశాలు ఇవ్వాలి
  4. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం జులై 15 (విజయక్రాంతి )సంగారెడ్డి జిల్లాలో సిగార్ ఫార్మా పరిశ్రమలో జరిగిన దారుణమైన దుర్ఘటనలో మరణించిన  కార్మిక కుటుంబాలకు, ఒక్కొక్కరికి  రూ 1 కోటి నష్టపరిహారం, క్షతగాత్రులకు రూ 50 లక్షలు చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించాలని, సంఘటనకు కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావడం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ధర్నాకు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కే సత్య అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి జీలకర్ర పద్మ , టి యు సి ఐ జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ రావు మాట్లాడుతూ సంబంధిత పరిశ్రమల లో జరుగుతున్న రక్షణ పరికరాల ఏర్పాటులో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఆ పనిని చేయకుండా యాజమాన్యం చెప్పినట్లు గుడ్డిగా నమ్మడం వల్ల దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించలన్నారు.

సిగార్ ఫార్మా కంపెనీ లో దుర్ఘటన జరిగిన సమయంలో వైద్య సదుపాయం కోసం కనీసం అంబులెన్స్లు కూడా అందుబాటులో లేవని, వైద్యానికిసంబంధించినటువంటి రక్షణ చర్యలు తీసుకోలేదన్నారు. ప్రాథమిక విచారణలో బయటపడిన నేటికీ యాజమాన్యం బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిందని వారు విమర్శించారు .

కార్మిక సంక్షేమ చట్టాలు అమలు చేయకుండా తప్పుడు సర్టిఫికెట్లు ప్రభుత్వానికి సమర్పించి ఈ ఘటన నుండి తప్పుకోవాలనీ చూస్తున్నరన్నారు.రాష్ట్రంలో వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకునే విధంగా యాజమాన్యాలు, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.  కార్మికులను రక్షించే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునారావృతం కాకుండా ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు .బా ధ్యత రాహిత్యంగా ఉన్న యజమానులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రవి సిఐటియు జిల్లా కమిటీ స భ్యులు భూక్య రమేష్ నాయకులు తులసీరామ్, రామ్ కోటి   టి యు సి ఐ. జిల్లా ఉపాధ్యక్షులు గొర్రె మోచుల రమేష్  రా జ్య లక్ష్మి. చుక్కమ్మ. వి. వాణి టీ.కృష్ణమూర్తి  నారాయణ  రాములు  తదితరులు పాల్గొన్నారు.