calender_icon.png 1 January, 2026 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేములవాడ భూనిర్వాసితులకు న్యాయం చేయాలి

01-01-2026 01:03:00 AM

* ఎకరానికి రూ. కోట్లల్లో...! పరిహారం లక్షల్లో..!!

* మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు : కొండ దేవయ్య పటేల్ ధ్వజం

వేములవాడ, డిసెంబర్31,(విజయక్రాంతి): వేములవాడలో రైల్వే లైన్, స్టేషన్, బస్టాండ్ నిర్మాణాల కోసం భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారమే పరిహారం చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.

పదేళ్లుగా గెజిట్ బ్లాక్ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎకరం విలువ కోట్లలో ఉండగా గతంలో తక్కువ పరిహారం ఇచ్చారని వారు వివరించారు. స్పందించిన కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.