01-01-2026 01:01:53 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 31 (విజయక్రాంతి): ప్రముఖ ట్రావెల్ వ్లాగర్, నా అన్వేషణ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు అన్వేష్‌పై హైదరాబాద్‌లోని పంజా గుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హిందూ దేవతలను, మహిళలను కించపరిచేలా అన్వేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్వేష్ చేసిన వ్యా ఖ్యలు సామాజిక భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయని పోలీ సులు ప్రాథమికంగా నిర్ధారించారు.
దీంతో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అన్వేష్‌కు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. అన్వేష్ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లా దానవాయిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కూడా అన్వ్పే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవీ దేవతలను దూషించడాన్ని హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
విదేశాల్లో ఉంటూ భారతీయ సంస్కృతిని, దేవతలను అవమానిస్తున్న అన్వేష్‌ను వెం టనే దేశానికి రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. అతన్ని దేశద్రోహిగా ప్రకటించి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరాయి. అన్వేష్ వీడియోలపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది.