3 May, 2026 | 8:57 PM

కడెం ప్రాజెక్టు పనులను వారంలో పూర్తి చేయాలి

26-06-2024 12:05 AM
  • ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్

నిర్మల్, జూన్25 (విజయక్రాంతి): కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు పనులను వారంలోపు పూర్తి చేయాలని ఖానాఫూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కడెం ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకొన్నారు. రూ.5 కోట్లతో చేపట్టిన పనులు 90 శాతం పూర్తి చేసినట్లూ అధికారులు వివరించారు. దెబ్బ తిన్న వరద గేట్లలో ఒక గేటును తిరిగి బిగించగా దాన్ని ట్రయల్ రన్ చేశారు. వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.