నేడు స్కూళ్లు బంద్
26-06-2024 12:05 AM
పిలుపిచ్చిన ఏబీవీపీ
హైదరాబాద్ జూన్ 25 (విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రైవేట్, కార్పొరేటు పాఠశాలల అక్రమ ఫీజులను అరికట్టి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ బుధవారం బడుల బందుకు పిలుపునిచ్చింది. పాఠశాల విద్యలో నెలకొన్న ఇతర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బందుకు పిలుపునిస్తున్నట్టు తెలంగాణ ఏబీవీపీ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని ప్రైవేట్ స్కూళ్లు బుధవారం సెలవులు ప్రకటించాయి.






