01-11-2025 02:58:52 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కార్తీక మాసం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో గత 25 రోజులుగా కాకడ హారతి ద్వారా నగర సంకీర్తన చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా 31 రోజులపాటు భజన కార్యక్రమాలతోపాటు భక్తిశ్రద్ధలతో కాకడ హారతి చేపట్టడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తెలిపారు.