07-10-2025 07:54:22 PM
స్థానిక శ్రీ విఠలేశ్వర ఆలయంలో కాకడ హారతి కార్యక్రమం ప్రారంభం..
కుభీర్ (విజయక్రాంతి): మండల కేంద్రం కుభీర్ లోని మరో పండరిపురంగా ప్రసిద్ధి చెందిన శ్రీ విఠలేశ్వర ఆలయంలో మంగళవారం కార్తీక దీపార్చనలో భాగంగా తెల్లవారుజామున కాకడ హారతి కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ముందుగా ఆలయ పూజారులు ప్రమోద్ జోషి, రాజు మహారాజ్ లు విట్టల రుక్మిణి విగ్రహాలకు అభిషేకం నిర్వహించారు. నూతన వస్త్రాల సమర్పణ అనంతరం కాకడ హారతి కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ బి పెంటాజి ప్రారంభించారు. భక్తులు నెయ్యితో చేసిన కాగడాలను చేతబూని వాటిని వెలిగించి స్వామివారికి హారతిని ఇస్తారు. అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెల్లవారుజాము నుండి కుభీర్ తో పాటు పరిసర గ్రామాల భక్తులు పెద్దసంఖ్యలో హాజరై ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. గత ఎన్నో ఏళ్లుగా స్వామివారికి కార్తీక మాసంలో నెలరోజులపాటు కాకడార్తి కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బి సునీల్, పుప్పాల పీరాజి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.