కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పేదలకు వరం
ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి..
కోదాడ: పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం చేపట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదలకు నిజమైన వరమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం పేదల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కట్టుబడి ఉంది. ప్రతి అర్హురాలికి ఆర్థిక సాయం అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్నారు. ఈ సందర్భంగా 192 మంది లబ్ధిదారులకు రూ కోటి 93 లక్షల 2వేల 156 విలువ కళ్యాణ లక్ష్మీ & షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఏ రమాదేవి, తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు కోదాడ మండల పార్టీ అధ్యక్షుడు తూమాటి వరప్రసాద్ రెడ్డి, కోదాడ మండల ఉపాధ్యక్షుడు ఇర్ల సీతారామరెడ్డి, ఎంపీటీసీ సింగారెడ్డి హిమబిందు సుమన్ రెడ్డి, పాలకి సురేష్, తొండపు సతీష్, నల్లపాటి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పులి సులోచన రావు, బానోతు అంబేద్కర్, ఎడవల్లి బాల్రెడ్డి, ఇర్లనారపరెడ్డి, తుమాటి నాగిరెడ్డి ,బండి కోటయ్య లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు






