calender_icon.png 23 September, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న ఈవో కార్యాలయం భీమేశ్వర సదన్‌కు తాత్కాలిక మార్పు

23-09-2025 05:19:55 PM

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఆలయంలోని కార్యాలయాలను తాత్కాలికంగా భీమేశ్వర సదన్‌కు మార్చారు.  ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో కార్యాలయం కూడా భీమేశ్వర సదన్‌కు మార్చబడింది.ఈవో కార్యాలయంతో సహా ఇంజనీరింగ్, గణాంక, పరిపాలన, లీజుల విభాగాలు ఇతర విభాగాలు భీమేశ్వర సదన్‌కు తాత్కాలికంగా మార్చబడ్డాయి. నూతనంగా ఏర్పాటు చేసిన ఈవో కార్యాలయంలో అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ మార్పు ఆలయ విస్తరణ పనులు పూర్తయ్యే వరకు కొనసాగనుంది, తద్వారా ఆలయ పరిపాలన సజావుగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.