23-09-2025 05:33:27 PM
సీసీఎల్ఎ రెవెన్యూ సెక్రెటరీ లోకేష్ కుమార్
వనపర్తి,(విజయక్రాంతి): నిషేధిత జాబితాలోని భూములను, వక్ఫ్ భూములను గుర్తించి నివేదిక ఇవ్వాలని సి.సి.ఎల్.ఎ రెవెన్యూ సెక్రెటరీ లోకేష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్లు (రెవెన్యూ), ఆర్డీఓ లు, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిషేధిత భూ జాబితా, రెవెన్యూ సదస్సు ద్వారా వచ్చిన పెండింగ్ భూ దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. కొత్తగా సర్వేటర్లను తీసుకోవడం జరిగిందని, జిల్లాలో ఉన్న నిషేధిత జాబితా భూములు, అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములు సర్వే చేయించి ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 121 ప్రకారం నిర్ణిత ప్రొఫార్మాలో పూరించి నివేదికలు పంపించాలని సూచించారు. అదేవిధంగా రెవెన్యూ సదస్సు ద్వారా వచ్చిన భూ దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సాదా బైనామా, అసైన్డ్ ల్యాండ్ దరఖాస్తులకు నోటీస్ లు జారీ చేయాలని సూచించారు.