6 July, 2026 | 3:12 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

కమల్‌హాసన్ రాజ్యసభ.. నామినేషన్ వాయిదా

04-06-2025 11:54 PM

భాషా వివాద నేపథ్యంలో నిర్ణయం..

న్యూఢిల్లీ: మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్(Makkal Needhi Maiam party leader Kamal Haasan) రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది థగ్ లైఫ్ సినిమా ఈవెంట్‌లో కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన నామినేషన్‌ను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో తన థగ్ లైఫ్ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, ఈ వ్యవహారాలు పూర్తయిన తర్వాతే ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కమల్ 2018లో మక్కల్ నీది మయ్యం పార్టీని నెలకొల్పారు. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించారు. దీంతో ఎంఎన్‌ఎంకు రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. దీంతో కమిల్‌హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారనే విషయాన్ని డీఎంకే ఇటీవల ఖరారు చేశాయి.