calender_icon.png 16 August, 2025 | 4:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గేదే లేదు

16-08-2025 03:26:53 PM

హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పరిశీలించాలని క్రమశిక్షణ కమిటీని ఆదేశించానని శనివారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) మీడియా సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకుంటామని, రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని పేర్కొన్నారు. అలాగే బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గే అవకాశమే లేదని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో త్వరలో స్పష్టత వస్తుందని, మార్వాడీలు మనలో ఒకరు.. వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు అన్నారు.