calender_icon.png 7 July, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కందనూలులో మంత్రి పొంగులేటి పర్యటన..

06-07-2025 04:36:46 PM

ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం, మన్ననూర్ గ్రామంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్(District Collector Badawat Santosh) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరి, ఉదయం 10:30 గంటలకు మన్ననూర్ మృగవాణి గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు.

అక్కడ స్థానిక రెవెన్యూ సమస్యలపై అధికారులతో సమీక్ష అనంతరం అమ్రాబాద్ పిడబ్ల్యు బీటీ రోడ్డుకు శంకుస్థాపన, గిరిజన భవనం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమిపూజ, చెంచు ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నూతన అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.