26-01-2026 11:09:58 AM
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ సందేశం
నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సాధించిన భారతదేశం, రాజ్యాంగం అమలులోకి వచ్చి సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కల్పించిందని గుర్తుచేశారు. రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీల అమలు దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి–సంక్షేమ పథకాల అమలులో కందనూల్ జిల్లా రాష్ట్రంలో ముందంజలో నిలుస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు.