10-05-2025 12:25:57 AM
ఇటీవల ‘ఎమర్జెన్సీ’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది కంగనా రనౌత్. ఎన్నో ఆటంకాలను దాటుకొని విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ చిత్రానికి నిర్మాతగా ఉన్న కంగనా ఇందులో ఇందిరాగాంధీ పాత్రలో ఆకట్టుకుంది.
ఇప్పుడు హాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్ అందుకుంది. హాలీవుడ్‌లో ఓ హారర్ చిత్రంలో కంగనా భాగమవుతోంది. ‘బ్లెస్డ్ బీ ద ఈవిల్’ అనే సినిమాలో కంగనా నటించను న్నది. ‘తను వెడ్స్ మను, ‘ఫ్యాషన్’, ‘క్వీన్’, ‘తలైవీ’ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ ఇప్పుడు హాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది.
ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించనున్న కంగనా.. స్కార్లెట్ రోజ స్టాలోన్‌తో స్క్రీన్ పంచుకోనుంది. యాక్షన్ హీరోగా రాణించిన సూపర్ స్టార్ సిల్వస్టర్ స్టాలోన్ కుమార్తెనే ఈ స్కార్లెట్ రోజ్ స్టాలోన్. ఈ సినిమాలో ‘టీన్ వోల్ఫ్’ నటుడు టైలర్ పోసే కూడా నటిస్తున్నాడు.
అనురాగ్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గాథ తివారీ స్క్రీన్‌ప్లే నిర్వర్తిస్తున్నా రు. వీరిద్దరే ఈ చిత్రానికి నిర్మాతలు గానూ వ్యవహరిస్తున్నారు. హారర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీ ఈ వేసవిలోనే షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది. విదేశీ చిత్రాలపై వంద శాతం సుంకం వసూలు చేయనున్నట్టు ఇటీవల ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని అమెరికాలోనే చిత్రీకరించనున్నారని సమాచారం.