10-05-2025 12:25:00 AM
అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్, డైరెక్టర్ మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న పాన్‌ఇండియా చిత్రం ‘థగ్‌లైఫ్’. ఈ సినిమా జూన్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆడియో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించాలనుకుంది మూవీటీమ్.
అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ వేడుకను వాయిదా వేసినట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు కమల్‌హాసన్ ‘ఆర్ట్ కెన్ వెయిట్ -ఇండియా కమ్స్ ఫస్ట్’ అంటూ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు. ‘దేశాన్ని రక్షించడంలో మన సైనికులు అప్రతిహత ధైర్యంతో ముందుండి పోరాడుతున్న వేళ ఇది వేడుకలకు సమయం కాదని భావిస్తున్నాం.
ఇది సంఘీభావానికి సమయమని నమ్ముతున్నాను. మే 16న నిర్వహించతలపెట్టిన ఆడియో లాంచ్ ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నాం. కొత్త తేదీని త్వరలో సముచితమైన సమయంలో ప్రకటిస్తాం. ఈ సమయంలో దేశాన్ని కాపాడుతూ అప్రమత్తంగా ఉన్న మన సైనికుల గురించి మనం ఆలోచించాలి. పౌరులుగా మనం సంయమనంతో, సంఘీభావంతో స్పందించాలి” అని కమల్‌హాసన్ పేర్కొన్నారు.