25-09-2025 12:43:37 AM
బెంగళూరు, సెప్టెంబర్ 24: కన్నడ దిగ్గజ రచయిత, తతవేత్త ఎస్‌ఎల్ భైరప్ప (94) గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు భైరప్ప్పు మృతిని ధ్రువీకరిస్తూ ప్రకటన విడుదల చేశాయి. 1931లో జన్మించిన భైరప్ప చన్నరాయపట్న, మైసూరుల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఆయన బీఏ, ఫిలాసఫీల్లో డిగ్రీ పట్టా పొందారు.
అనంతరం ఫిలాసఫీలో ఎంఏ పూర్తి చేశారు. కన్నడ భాషలో ఎన్నో రచనలు చేసిన భైరప్పకు పద్మ విభూషణ్, పద్మ శ్రీ, సరస్వతి సమ్మాన్, సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి. వంశవృక్ష, పర్వ, దత్తు, మందార వంటి ఎన్నో పేరు గాంచిన రచనలు చేశారు.
1966లో సాహిత్య అకాడమీ అవార్డు, 2010లో సాహిత్య సమ్మాన్, 2016లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ అవార్డులు ఆయన్ను వరించాయి. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. మహోన్నత వ్యక్తిని కోల్పోయాం అని ఎక్స్‌లో పేర్కొన్నారు.