23-12-2025 09:27:56 PM
ముకరంపుర,(విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న జి.వెంకటస్వామి స్మారక తెలంగాణ రాష్ట్రస్థాయి అంతర జిల్లా టి20 లీగ్ మ్యాచ్లలో కరీంనగర్, పెద్దపల్లి జట్లు విజయం సాధించాయి. మంగళవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో నిర్వహించిన మొదటి మ్యాచ్లో కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో కరీంనగర్ జట్టు విజయం సాధించగా, బ్యాటింగ్, బౌలింగ్లో ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచిన సాత్విక్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆ తర్వాత జరిగిన రెండవ మ్యాచ్లో జగిత్యాల, పెద్దపల్లి జిల్లా జట్లు తలపడ్డాయి. పెద్దపల్లి జట్టు విజయం సాధించగా, అద్భుత బౌలింగ్తో నాలుగు వికెట్లు తీసుకున్న రాహుల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.