23-12-2025 09:31:06 PM
మణుగూరు,(విజయక్రాంతి): పట్టణంలోని రాజీవ్ గాంధీ నగర్ లోని రాధికా కాన్సెప్ట్ స్కూల్లో మంగళవారం మెగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలయేసు జన్మించిన పశువుల పాక అలంకరణ వీక్షకులను ఆకట్టుకుంది. ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపే పలు నాటికలు విద్యార్థులు చేత ప్రదర్శించి ఏసుక్రీస్తు శాంతి సందేశం సారాంశాన్ని తెలియపరిచారు. చిన్నారులు దేవదూతల వేషధారణలో ఆకట్టుకున్నారు.
పశువుల కాపరులు, ఏసుక్రీస్తు, మరియా మాత, ఆనాటి యూదుల, రాజుల వేషధారణలు చూపర్లను ఆకర్షించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాఠశాల చైర్మన్ గంగిరెడ్డి మధుసూదన్ రెడ్డి హాజరై పిల్లలకు బహుమతులు అందజేసే ప్రసంశించారు. కార్యక్ర మంలో పాఠశాల డైరెక్టర్స్ సిహెచ్.జయ సింహా రెడ్డి,సంపత్ రెడ్డి ,బద్దం శ్రీనివాస్ రెడ్డి, రమేష్, ప్రధానోపాధ్యాయులు నరేష్, అధ్యాపకులు ఉషా,కీర్తి ,ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొన్నారు.