05-11-2025 07:44:19 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ అశోక్ కాలనీ ప్రసన్నాంజనేయ దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సహస్ర విష్ణు నామస్మరణ, కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్ష, కార్యదర్శి చింతం శ్రీనివాస్, సర్వోత్తమ్ రెడ్డిలు మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం కాలనీలో దేవాలయ ప్రాంతంలో కార్తీక దీపోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని. త్వరలో రామాలయం నిర్మాణం జరుగుతుందని వారు అన్నారు. కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ కాలనీ అభివృద్ధి కమిటీ, దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీవాసులు, మహిళ భక్తులు, తదితరులు పాల్గొన్నారు.