05-11-2025 07:41:41 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ కి మద్దతుగా బుధవారం బోరబండ డివిజన్ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఉప ఎన్నికల ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శన చేస్తూ ప్రజలతో మమేకమై, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాలను వివరించారు.
నవంబర్ 11న జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ప్రజలు ఐక్యంగా ఓటు వేసి నవీన్ యాదవ్ ని ఘన విజయం సాధింపజేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ జనహితమే మా ధ్యేయం. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పతాకం ఎగరనుంది. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే హస్తం గుర్తుకు ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.