22-10-2025 08:15:27 PM
ప్రత్యేక అలంకరణలో శివలింగం..
గరిడేపల్లి (విజయక్రాంతి): కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కీతవారిగూడెం గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బుధవారం మొదటి రోజు సందర్భంగా సుప్రభాత సేవ, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చన, సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమపూజ, నిరాజనం, మంత్రపుష్పాలతో విశేష సేవలు నిర్వహించారు. సాయంత్రం కమిటీ ఆధ్వర్యంలో ఆకాశ దీపం ప్రజ్వలన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసంలో ప్రతి రోజు ఆలయంలో రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనతో పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవాలయ కమిటీ అధ్యక్షులు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు జుట్టుకొండ చంద్రయ్య, సభ్యులు బాల్దూరి అంజయ్య, సూరయ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు.