22-10-2025 09:04:57 PM
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..
కామారెడ్డి (విజయక్రాంతి): పేదింటి ఆడబిడ్డల కోసమే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు అమలు చేస్తున్నట్లు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. బుధవారం డోంగ్లి మండల కేంద్రంలోని తాహసీల్దార్ కార్యాలయంలో మండలానికి సంబంధించిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లిలకు మేమున్నామని భరోసా ఇస్తూ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పథకాన్ని అమలు చేయడం వల్ల పేదలు మూడు పూటలా కడుపు నిండా అన్నం తింటున్నారని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. ప్రతీ పేదింటిలో సంక్షేమ కాంతులు నింపాలన్నదే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.