calender_icon.png 22 October, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి విద్యార్థి ఆంగ్లంలో మాట్లాడాలి

22-10-2025 08:46:27 PM

కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి..

రఘునాధపాలెం (విజయక్రాంతి): జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లీషులో అనర్గళంగా చదివే విధంగా యాప్ లో వినియోగించుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం ఖమ్మంలోని శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో యాప్ ను ప్రారంభించారు. అనంతరం మండల విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు శిక్షణను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రతి పాఠశాలలో యాప్ ప్రారంభం కావాలని, పిల్లలందరూ నెలలో చదవడం చేయాలన్నారు. ప్రతిరోజు 1 తరగతి నుంచి 6వ తరగతి వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి 4 గంటల వరకు ఏ కార్యక్రమం నడుస్తుందన్నారు. ప్రతి బుధవారం ఉపాధ్యాయులు యాప్ లో పిల్లల ప్రోగ్రాం అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీజ తదితరులు పాల్గొన్నారు.