calender_icon.png 22 October, 2025 | 11:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

22-10-2025 08:41:42 PM

ఎమ్మెల్యే కవ్వంపల్లి

బెజ్జంకి: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి వారు అభివృద్ధి చెందాలన్నదే ప్రజా ప్రభుత్వా లక్ష్యం అని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బెజ్జంకి మండల పరిధిలోని తోటపల్లి, ముత్తన్నపేట, గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, బెజ్జంకిలో మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ వరిధాన్యం, మక్కల కొనుగోలు, కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని, పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, ప్యాక్ చైర్మన్ తన్నీరు శరత్ రావు, బండి రమేష్, ఒగ్గు దామోదర్, కర్రావుల శంకర్, గుడెల్లి శ్రీకాంత్, జెల్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.