calender_icon.png 23 October, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికిత్స పొందుతూ మహిళ మృతి

22-10-2025 09:48:33 PM

కల్వకుర్తి: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ పురపాలక పరిధిలోని సిలార్ పల్లకి చెందిన స్వాతి(35) అనే మహిళ మృతి చెందినట్లు ఎస్సై మాధవరెడ్డి తెలిపారు. ఈ నెల 18న తన భర్త సైదులుతో కలిసి వెల్దండ నుండి స్వగ్రామానికి వెళ్తుండగా పట్టణంలోని జింజర్ హోటల్ ముందు వాహనం అదువుతప్పి పడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతురాలి సోదరుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.