22-10-2025 09:52:23 PM
కల్వకుర్తి: ఓ మహిళకు కల్లు తాగించి ఆటోలో పట్టణ శివారులోకి తీసుకెళ్లి ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలను చోరీచేసిన కేసులో నిందితుడు వరికుప్పల వెంకటేష్ కు కల్వకుర్తి కోర్టు న్యాయమూర్తి కావ్య ఆరు నెలల జైలు శిక్షతో పాటు 1000 రూపాయలు జరిమాన విధించారు. 2021లో పట్టణంలోని ఎన్జీవో కాలనీ చెందిన వెంకటేష్ మహిళను మోసం చేసి చోరీకి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్సై మహేందర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితునిపై నేరం నిరూపణ కావడంతో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేసినట్లు పోలీసులు తెలిపారు.