calender_icon.png 22 October, 2025 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష

22-10-2025 08:54:02 PM

కామారెడ్డి (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష నిర్వహించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి నిర్మాణ దశను జిపిల వారిగా అధికారులను అడిగి తెలుసుకొని గడువులోగా వివిధ దశలో ఉన్న నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కల్పిస్తున్న గృహాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం గృహ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రతి లబ్ధిదారుడు స్వంత గృహం కలగటం ప్రభుత్వం ప్రధాన లక్ష్యమన్నారు. ఎక్కడైనా సాంకేతిక లేదా పరిపాలనా ఇబ్బందులు ఉంటే వెంటనే తెలియజేయాలనీ సూచించారు. నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, ఇళ్ల నిర్మాణంలో ఉన్న అడ్డంకులను గుర్తించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం సమిష్టిగా పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.