calender_icon.png 22 October, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

49 వైన్ షాపులకు 1449 దరఖాస్తులు

22-10-2025 08:24:59 PM

వైన్ షాపులు దక్కించుకోవడానికి పెరిగిన పోటాపోటీ..

వైన్ షాపుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు 23న చివరి రోజు..

జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ హనుమంతరావు..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో మద్యం షాప్ ల దరఖాస్తుల ప్రక్రియ 2025-2027 సంవత్సరానికి 49 మద్యం దుకాణాలకు బుధవారం నాటికి 1449 దరఖాస్తులు రావడం జరిగిందని మరో రోజు గడువు ఉందని ఎక్సైజ్ సూపరిండెంట్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి స్టేషన్ పరిధిలో మొత్తం 15 వైన్ షాపులకు 450 దరఖాస్తులు వచ్చాయి. దోమకొండ స్టేషన్ పరిధిలో మొత్తం 8 వైన్ షాప్ లకు 307 దరఖాస్తులు వచ్చాయి. ఎల్లారెడ్డి స్టేషన్ పరిధిలో మొత్తం 07 వైన్ షాప్లకు 226 దరఖాస్తులు వచ్చాయి. బాన్సువాడ స్టేషన్ పరిధిలో మొత్తం 09 వైన్ షాప్లకు గాను 245 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. బిచ్కుంద ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్ పరిధిలో మొత్తం 10 వైన్ షాపులకు 221 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. బుధవారం వరకు కామారెడ్డి జిల్లాలో 49 వైన్ షాప్ లకు 1449 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తుదారులు ఈనెల 23న సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఎక్సైజ్ సూపర్డెంట్ హనుమంతరావు తెలిపారు.