22-10-2025 08:11:52 PM
పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం పెద్దపల్లి పట్టణం మున్సిపల్ పరిధిలోని పలు వార్డులకు చెందిన ముఖ్య నాయకులతో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామణరావు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.