calender_icon.png 23 October, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశీ కలుపు మొక్కలు.. ప్రకృతికి ప్రమాదకరం: తాసిల్దార్

22-10-2025 09:58:41 PM

తాండూరు (విజయక్రాంతి): విదేశీ కలుపు మొక్కలు ప్రకృతికి ప్రమాదకరమని.. పశువుల మేత, వ్యవసాయం, జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, వాటి నిర్మూలన ప్రతి పౌరుడి బాధ్యతగా తీసుకోవాలని వికారాబాద్ జిల్లా పెద్దెముల్ తాసిల్దార్ వెంకటేష్ ప్రసాద్ అన్నారు. నేడు పెద్దముల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ECO FAWN Society ఆధ్వర్యంలో విదేశీ కలుపు మొక్కల అవగాహన, నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామూహిక భాగస్వామ్యం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని, గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు మరింత విస్తరించాలని తెలిపారు. అంతకుముందు విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కళాశాల పరిసరాల్లోని విదేశీ కలుపు మొక్కలను తొలగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, ECO FAWN Society  ప్రతినిధులు సాయి సంపత్, తలారి విక్రమ్, భాను ప్రసాద్, మొయిజ్, తదితరులు పాల్గొన్నారు.