16-11-2025 07:16:39 PM
కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ఐక్యతకు ప్రాధాన్యం ఇస్తామని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కరీంనగర్ సప్తగిరి కాలనీ ఎస్సారార్ ఫంక్షన్ హాల్ లో డబ్ల్యూజేఐ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జర్నలిస్టుల సమస్యల సాధనే లక్ష్యంగా డబ్ల్యూజేఐ పని చేస్తుందన్నారు. జాతీయ స్థాయిలో 17 రాష్ట్రాలలో కార్యకలపాలు కొనసాగిస్తున్న డబ్ల్యూజేఐ తెలంగాణలో బలమైన శక్తిగా రూపుదిద్దుకుంటోందన్నారు. క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం సంఘం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నదని రావికంటి శ్రీనివాస్ వెల్లడించారు.
కొన్ని యాజమాన్యాలు జర్నలిస్టులకు వేతనాలు ఇవ్వడం లేదన్న విషయంపై లేబర్ కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఓ వైపున యూనియన్ నిర్మాణం కోసం కృషి చేస్తూనే మరో వైపున జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేస్తున్న ఘనత డబ్ల్యూజేఐకే దక్కిందని రావికంటి శ్రీనివాస్ వివరించారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరు కరుణాకర్, అనిల్ దేశాయ్, కార్యదర్శి శివనాధుని ప్రమోద్ కుమార్, కార్యవర్గ సభ్యుడు టి.సత్యనారాయణ పాల్గొన్నారు. బి ఎం ఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ కరీంనగర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఆదివారం ఏర్పాటయింది. స్థానిక సప్తగిరి కాలనీలోని ఎస్ ఆర్ ఆర్ బాంకెట్ హాలులో జరిగిన సమావేశంలో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా దారం జగన్నాథరెడ్డి, ఉపాధ్యక్షులుగా మొగురం రమేష్, నర్సరీ కేదారి