16-11-2025 07:25:22 PM
ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
చండూరు (విజయక్రాంతి): పేదోడి సొంతింటి కల ప్రజా ప్రభుత్వంలోనే నెరవేరిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Raj Gopal Reddy) అన్నారు. ఆదివారం చండూరు మండల పరిధిలోని తాస్కాని గూడెం గ్రామంలో షేక్ లతీఫ్, మున్నాబి దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డులు మంజూరు, ఇందిరమ్మ ఇండ్లు,సన్న బియ్యం, రైతులకు రుణమాఫీ, మహిళల ఖర్చుతో బస్సు ప్రయాణం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచిందని అన్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పులపాలుగా చేసి రైతులను ప్రజలను మోసం చేసిందన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాధికారం లోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకే దక్కిందన్నారు.మిగతా ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పాటు తన సొంత నిధులు సమకూర్చుకొని లతీప్ ఇంటిని పూర్తి చేసుకోవడంచాలా మంచి పరిణామమని ఆయన అన్నారు. ఏ కష్టం వచ్చినా మునుగోడు నియోజకవర్గ ప్రజలకు నేనెప్పుడూ అండగా ఉంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు, స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శి, కాంగ్రెస్ మండల, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.