calender_icon.png 5 September, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా మోర మోహన్, గణేష్ ఎంపిక

05-09-2025 02:42:59 PM

నంగునూరు: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా గట్లమల్యాల ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మోర మోహన్, సోదరుడు గణేష్ లు ఎంపికయ్యారు. వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తిలో మరింత బాధ్యతగా పనిచేస్తామని తమకు లభించిన ఈ గౌరవం విద్య రంగానికి మరింత సేవ చేసేందుకు ప్రోత్సాహం వస్తుందని తెలిపారు. ఈ పురస్కారం వెనుక తమ కుటుంబం ఉపాధ్యాయులు విద్యార్థుల సహకారం ఎంతో ఉందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని టిటిసి భవన్‌లో శుక్రవారం పురస్కారం అందుకోనున్నారు. ప్రజలు, ఉద్యోగుల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.