05-09-2025 02:34:57 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): ఖానాపూర్ మండలంలోని అన్ని గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఖానాపూర్ ఎంపీడీవో సిహెచ్ రత్నాకర్ రావు(MPDO Ratnakar Rao), తాహసీల్దార్ సుజాతా రెడ్డి(Tahsildar Sujatha Reddy)లు సూచించారు. శుక్రవారం మండలంలోని గ్రామపంచాయతీల క్లస్టర్ స్థాయి సమావేశం నిర్వహించారు. దీనిలో రాజుర, సింగపూర్, దాసి నాయక్ తండ, చందు నాయక్ తండా, బావా పూర్ ఆర్, గ్రామాల నుంచి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, కమిటీ సభ్యులు, గ్రామపంచాయతీ సెక్రటరీలు, పలువురు పాల్గొన్నారు.