calender_icon.png 5 September, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనుబోతుల కొమురయ్య సేవలు చిరస్మరణీయం..

05-09-2025 02:39:51 PM

శాంతి కని గనిలో 29 వర్ధంతి

బెల్లంపల్లి అర్బన్: ఏఐటీయూసీ(AITUC) అగ్ర నేత దివంగత మనుబోతుల కొమురయ్య సేవలు చిరస్మరణీయమని ఆ యూనియన్ రెండు బ్రాంచీల ఇన్చార్జి చిప్ప నరసయ్య(In-charge Chippa Narsaiah) అన్నారు. శాంతిఖని గనిలో శుక్రవారం సింగరేణి కాలరీస్ వర్కర్ యూనియన్ మాజీ జనరల్ సెక్రటరీ మనుబోతుల కొమరయ్య 29వ వర్ధంతి సంతాప సభ నిర్వహించారు. శాంతిఖని గని అసిస్టెంట్ పిట్ సెక్రటరీ మంతెన రమేష్ అధ్యక్షతన జరిగిన కొమురయ్య వర్ధంతి సభలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ రెండు బ్రాంచ్ ల ఇంచార్జి సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య హాజరై మాట్లాడారు. కొమురయ్య  కార్మికులకు చేసిన సేవలు మరువలేని అన్నారు. సింగరేణి కార్మికులకు పెన్షన్, ఇతర హక్కులు సాధించి పెట్టినవి వివరించారు. ఈ కార్యక్రమoలో వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు, p. రాజలింగ్, మిట్టపల్లి రమేష్, రవి, మైన్స్ కమిటీ సభ్యులు, ప్రశాంతం, సంతోష్ కుమార్, సేఫ్టీ కమిటీ సభ్యులు, అశోక్, రాజేష్ శ్రీకాంత్, గణేష్, బొంకురి రాoచందర్, స్వామి దాసు, కార్మికులు పాల్గొన్నారు.