calender_icon.png 5 September, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం

05-09-2025 02:47:27 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకొని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ ఎర్ర హరికృష్ణ, రిటైర్డ్ ఉద్యోగులు కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, కాస మల్లయ్య, తాళ్లపల్లి యాదగిరి, గుజ్జ రామచంద్రయ్య, బండారు రామచంద్రయ్య, అబ్బయ్య, మిట్ట గడుపుల పురుషోత్తం, మహిళా ఉపాధ్యాయురాలు ఎల్లబోయిన కృష్ణవేణి, తాళ్ల పెళ్లి, విజయలక్ష్మిలను లయన్స్ క్లబ్ తుంగతుర్తి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పెన్షనర్స్ భవనంలో శుక్రవారం జాలవాలతో ఘనసన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా సభాధ్యక్షులుగా లైన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తల్లాడ కేదారి మాట్లాడుతూ, సమాజంలో ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేని వర్ణించారు.

విద్యార్థులు విద్యలో రాణించాలన్న ఉన్నతమైన ఉద్యోగాలు పొందాలన్నా సత్మార్గంలో పయనించాలన్న ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, వారికి సన్మానం చేసుకోవడం మనందరి అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి లైన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పులుసు వెంకన్న గౌడ్, లయన్స్ క్లబ్ కోశాధికారి గుండ గాని రాము లయన్స్ క్లబ్ సభ్యులు ఓరుగంటి సుభాష్, పులుసు వెంకటనారాయణ, రామాలయ చైర్మన్ ఎనగందుల సంజీవ, గిరి టైలర్స్, వీరబోయిన రాముల యాదవ్, ఎనగందుల శ్రీను, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఈగ నాగన్న, జిల్లా ఉపాధ్యక్షులు బండారు దయాకర్, తదితరులు పాల్గొన్నారు.