calender_icon.png 5 September, 2025 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశ్రీశ్రీ బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

05-09-2025 02:31:53 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని దుబ్బగూడం శ్రీశ్రీశ్రీ బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణేష్ మండపంలో శుక్రవారం గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి పూజలు అందుకున్న గణనాధునికి ప్రత్యేక పూజలు అనంతరం నిమజ్జనానికి తరలించారు. అంతకుముందు నవరాత్రులు పూజలు అందుకున్న గణేష్ చేతిలోని లడ్డు ప్రసాదాన్ని భక్తులకు, కాలని వాసులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు కోలేటి శివప్రసాద్ భక్తులకు కాలనీవాసులకు లడ్డూలను పంపిణీ చేశారు. అంతకుముందు హిందూ ఉత్సవ సమితి సభ్యులు రామటెంకి దుర్గరాజు గణేష్ నికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల గణేష్ మండలి కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి బాలరాజ్, కమిటీ సభ్యులు దుర్గం కిరణ్, తాళ్ళపల్లి లక్ష్మణ్, చంద్రమౌళి, మహిళలు కాలనీవాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.