29-07-2025 03:25:00 PM
కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలో మంగళవారం కావడి యాత్రను వైభవంగా నిర్వహించారు. బద్రీనాథ్, కేదారినాథ్ పుణ్యక్షేత్రాల నదుల నుంచి తీసుకువచ్చిన జలాలతో భక్తులు కావడియాత్ర చేపట్టారు. హనుమాన్ మందిర్ నుంచి భక్తులు కావడి ద్వారా శివాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయంలో జలాలతో శివుడికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ యాత్రలో ఎమ్మెల్యే హరీష్ బాబు, భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.