calender_icon.png 30 July, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ

29-07-2025 03:22:00 PM

మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా  మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు  గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణనికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల లబ్ది చేకూర్చేందుకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు కృషిచేస్తున్నారన్నారు.ఇండ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు లబ్దిదారుల అకౌంట్లలో జమచేస్తుందని అన్నారు. నిరుపేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి.. వారి కళా సహకారం చేస్తుందన్నారు.