25-01-2026 06:49:33 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సయ్య పల్లి వాసి సోషియల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సౌత్ ఇండియా చైర్మన్ గా నర్సయ్యపల్లి సర్పంచ్ గా ఎన్నికైన డా.జూపల్లి తిరుమల రావుకు ఆదివారం పాండిచ్చేరిలో జరిగిన కార్యక్రమంలో "ఆసియాన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసర్చ్ యూనివర్సిటీ" వారు నెల్సన్ మండేలా సేవా రత్న, హ్యుమానిటీరియన్ అవార్డునుఅనే రంగం పైన ప్రధానం చేశారు.
ఈ సందర్బంగా జూపల్లి తిరుమల రావు మాట్లాడుతూ... తాను రాజకీయ రంగంలో, సామాజిక సేవా కార్యక్రమాల్లో అలాగే వ్యాపార రంగాల్లో చేసిన సేవలను, మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరికీ సామాజిక న్యాయం అందేలా పని చేసినందుకు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారు గుర్తించి నెల్సన్ మండేలా సేవా రత్న అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే తన సేవలను మెచ్చి సర్పంచ్ గా నన్ను ఎన్నుకున్న ప్రజలకు, పార్టీ పెద్దలకు, కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఇంతటి గొప్ప అవార్డు అందించిన యూనివర్సిటీ పెద్దలకు, యజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.