25-01-2026 06:54:23 PM
- బెల్లంపల్లిలో పోస్టర్ ఆవిష్కరణ
బెల్లంపల్లి,(విజయక్రాంతి): రైల్వే కార్మికుల సమస్యలపై దక్షిణ మధ్య రైల్వే మద్దూర్ యూనియన్ ఫిబ్రవరి 2న తలపెట్టిన కోరికల దినాన్ని విజయవంతం చేయాలని దక్షిణ రైల్వే మజ్దూర్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ ఛైర్మెన్ ఎస్ నాగరాజు, సెక్రెటరీ జీ సాంబాశివుడు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని ఆర్వోహెచ్ డిపో షెడ్ లో డిమాండ్స్ డే వాల్ పోస్టర్లను విడుదల చేసి మాట్లారు. 8వ వేతన సంఘం సిఫార్సులను 2026 జనవరి1 నుండి ఉద్యోగులందరి అమలు పర్చాలని కోరారు. ఉద్యోగులకు, పింఛనుదారులకు, సేఫ్టీ కేటగిరీలలో పనిచేస్తున్న సిబ్బంది కి రిస్క్, హార్టప్ అలవెన్సును చెల్లించాలని డిమాండ్ చేశారు.
ట్రాక్ మెయింటెనర్లకు రిస్క్ అలవెన్సును పెంచాలన్నారు. ట్రాక్ మెయింటెనర్ల గ్రేడ్ పేలు రూ.2400, రూ.2800లను విలీనం చేస్తూ అందరుట్రాక్ మెయింటెనర్లకు రూ. 4200 గ్రేడ్ పే ను మంజూరు చేయాలనికోరారు. డైరెక్టు రిక్రూట్మెంట్ కోటాలోని 10 శాతం పోస్టులను ఎల్డీసీఈకి కేటాయించి ఎల్ డీ ఈ సీ ఈ లో అందరికి అవకాశం కల్పించాలన్నారు.
పాయింట్స్ మెన్ కేటగిరీకి నాలుగు గ్రేడ్ పేల వేతన స్ట్రక్చర్ను మంజూరు చేయాలని దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని డిపార్టుమెంట్లలో టెక్నీషియన్ గ్రేడ్-ఐ, గ్రేడ్-II పోస్టులను విలీనం చేయాలని కోరారు. ట్రాక్ మెయింటెనర్లుగా,లోకో పైలట్లుగా, ట్రైన్ మేనేజర్లు తదితర కేటగిరీలలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి కేటగిరీల వారీగా డిపార్టుమెంట్లలో మార్పుకై ఒక్కసారి ప్రాతిపదికపై అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కరువు భత్యం 2024 జనవరి 1 నుండి 50 శాతానికి చేరటం ద్వారా లోకో పైలట్లకు కిలోమీటరేజి అలవెన్సును పెంచాలని కోరారు.
అంతేకాకుండా 70శాతం రన్నింగ్ అలవెన్సును ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని,అన్ని కేటగిరీల కేడర్ పునర్వ్యవస్థీకరణకు సత్వరమే తుది రూపం ఇవ్వాలని, పునరుద్ఘాటించారు. పెరిగిన సర్వీసులు, క్రొత్త లైన్ల ఏర్పాటుకు అనుగుణంగా అదనపు పోస్టులను కల్పించాలని, పెట్రోలింగ్ డ్యూటీకి ఇద్దరు పెట్రోల్ మెన్లను వినియోగించాలనీ, వారి బీట్ లెంత్ ను తగ్గించాలని, కోరారు. కీ మెన్లకు పని భారం తగ్గించాలనన్నారు. ఈ కార్యక్రమం లో సిఎండబ్ల్యూ షడ్ సిక్లైన్ షెడ్ లోకో లాబీ ఆఫీస్ బేరర్స్, సిఎండబ్ల్యూలోకో పైలెట్లు పాల్గొన్నారు.