25-01-2026 06:57:49 PM
సిద్దిపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్
సిద్దిపేట రూరల్: రాష్ట్ర స్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ పోటీలకు ఎంపిక ప్రక్రియను సిద్దిపేట జిల్లా ఇర్కోడు గుట్టల్లో 24, 25 జనవరి 2026 తేదీలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వంగ రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని, సైక్లింగ్ వంటి క్రీడలు ఆరోగ్య పరిరక్షణలో కీలకమని తెలిపారు.
క్రీడాకారుల ఎదుగుదలకు సమాజం మొత్తం సహకరించాలని, తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్స్ కమిటీ చైర్మన్ మ్యాక్స్ వెల్ ట్రావర్, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బండారుపల్లి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి జంగపల్లి వెంకటనర్సయ్యతో పాటు మార్క రామదాసు గౌడ్, రాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.