25-01-2026 06:19:11 PM
బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో కడుపు నొప్పి తాళలేక ఓ మహిళ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిందని నెన్నెల పోలీసులు ఆదివారం తెలిపారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుండ్ల సోమవారం గ్రామంలో దుర్గం సౌమ్య ను , గుండ్ల సోమారం గ్రామానికి చెందిన కడుపు నొప్పి తాళలేక ఈనెల 21న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగింది.
ఇంతలోనే ఇంటికి వచ్చిన సౌమ్య అత్తయ్య వసంత భర్త రాజ్ కుమార్, ఆడపడుచు కోట భాగ్య ఆమె భర్త మల్లేష్ సౌమ్య నోటి నుంచి నురగ రావడంతో వెంటనే ఆటోలో చికిత్స కోసం మంచిరాల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. సౌమ్యకు బాబు, పాప ఉన్నారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.