calender_icon.png 25 January, 2026 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు

25-01-2026 06:17:06 PM

పెంచికల్ పేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఎల్కపల్లి కస్తూర్బా  పాఠశాల విద్యార్థులతో జాతీయ ఓటర్లు దినోత్సవం సందర్బంగా పాఠశాల నుంచి మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాల గుండా  ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ప్రతీ ఏడాది జనవరి 25వ తేదీన ఇండియాలో జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటుంటామని తహసీల్దార్  తిరుపతి తెలిపారు. ఓటు వేయడానికి అర్హత కలిగిన ప్రతీ ఒక్కరినీ తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రోత్సహించి ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంపొందించడమే జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రధాన లక్ష్యమన్నారు.

అనంతరం మండలం లోని ప్రధాన చౌరస్తాలో విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేసి ఓటు హక్కు అవసరంపై అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దారు చిన్ను, ఆర్ఐ రాజేష్, సీనియర్ అసిస్టెంట్ జూగాడి రావు, ఎలకపల్లి సర్పంచ్ భక్తు రామచందర్,జిపిఓ లు, జూనియర్ అసిస్టెంట్లు, తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది మరియు ఉపాధ్యాయులు, నాయకులు జునగారి మధుకర్,పొట్టే మహేష్, ఎల్కరి లచ్చన్న మరియు తదితరులు పాల్గొన్నారు.