07-01-2026 01:22:42 AM
హైదరాబాద్, జనవరి 6(విజయక్రాంతి): కవిత ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు ఆమోదం లభించింది. ఆమె రాజీనామాను కొద్దిసేపటి క్రితమే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో కవితను బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆమె తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అప్పటి నుంచి కవిత రాజీనామా పెండింగ్‌లో ఉంది.
సోమవారం కవిత మండలికి హాజరై తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. దీంతో ఆమె రాజీనా మాను మండలి చైర్మన్ ఆమోదించారు. కాగా కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. తాజాగా కవిత రాజీనామాను ఆమోదించడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ జారీ అయింది.