calender_icon.png 10 January, 2026 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులెవరూ ఆందోళన చెందొద్దు

07-01-2026 01:22:11 AM

  1. రాష్ట్రంలో ఎరువులు సమృద్ధిగా ఉన్నాయి
  2. యూరియా కొరత ఉందని తప్పుడు ప్రచారం 
  3. అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. యూరియా - 1,67,884 మెట్రిక్ టన్ను లు, డీఏపీ- 51,458 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు -2,67,661 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ -22,367 మెట్రిక్ టన్నులు, ఇతర ఎరు వులు -30,880 మెట్రిక్ టన్నులు నిల్వలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు.

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మంగళవారం ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్, మదన్‌మోహన్‌రావు తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తుమ్మల సమాధానమిచ్చారు. ఎరువులు కొర త లేకుండా అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎరువుల సరఫరాలో పారదర్శకత తీసుకురావడానికి ఫెర్టిలైజర్ యాప్‌ను 5 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమ లు చేస్తున్నామని, ఇప్పటివరకు ఈ యా ప్ ద్వారా 1.59 లక్షల మంది రైతులు 4.55 లక్షల యూరియా బస్తాలు కొనుగోలు చేసిన ట్లు మంత్రి తెలిపారు.

యాప్ అమలులో ఉన్న జిల్లాల రైతులు, డీలర్లు యాప్ పనితీరుపై సం తృప్తి వ్యక్తం చేశారన్నారు. అన్ని జిల్లాల్లో యాప్ అమలులోనికి తీసుకువస్తామని చెప్పా రు. రాష్ట్రంలో రెండు, మూడు చోట్ల రైతు ఆదుర్దా పడిన సంఘటనలను చూపెట్టి యూరియా కొరత ఉందని కొందరు తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు.

గత ఖరీఫ్ సీజన్‌లో కేంద్రం నుంచి యూరియా ఆలస్యంగా రావడం, అదే సమయంలో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీ ఎల్) మూతపడటంతో కొంత ఇబ్బంది ఏర్పడిందన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభు త్వంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ, అవసరమైన ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్రాని కి మొత్తం 9.79 లక్షల మెట్రిక్ టన్నుల యూరి యా సరఫరా చేయగలిగామని చెప్పారు. ఇది 2024- 25 ఖరీఫ్‌తో పోల్చితే 13 వేల మెట్రిక్ టన్నులు అధికమన్నారు.