14-07-2025 12:18:59 AM
- జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్
మంచిర్యాల, జూలై 13 (విజయక్రాంతి) : జిల్లాలోని నిరుద్యోగ ట్రాన్స్ జెండర్లకు ఉపాధి పునరావాస పధకం అమలు చేస్తున్నట్లు జిల్లా మహిళా, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ వెల్లడించారు.
ఆదివారం ఆయన మాట్లాడుతూ వివిధ రంగాలలో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన ట్రాన్స్ జెండర్ ల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఉపాధి కల్పించేందుకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణలో భాగంగా డ్రైవిం గ్, ఫొటో, వీడియోగ్రఫీ, బ్యూటీషియన్, జ్యూట్ బ్యాగ్ తయారీ, టైలరింగ్, లాజిస్టిక్ రంగాలలో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఆసక్తి, అర్హత గల ట్రాన్స్ జెండర్లు www. wdsc.telangana.gov.in వెబ్ సైట్‌లో ఈ నెల 23 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 040 - 24559050లో సంప్రదించవచ్చన్నారు.