calender_icon.png 9 November, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన

09-11-2025 01:22:49 AM

  1. శంషాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన విమానంలో సాంకేతికలోపం  
  2. అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రయాణికుల ఆగ్రహం

శంషాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): శంషాబాద్ విమానాశ్రయం నుంచి వియత్నాం వెళ్లాల్సి విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో శంషాబాద్‌లోనే విమానం నిలిచిపోయింది. దీంతో ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు శంషాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సి ఉంది. సమయానికి విమానం రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

విమాన రాకపోకలపై ఎయిర్‌పోర్ట్ అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు అగ్రహానికి గురై అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ఎయిర్‌లైన్ సిబ్బందిపై మండిపడ్డారు. దాదాపు 200 మంది ప్రయాణికులు రాత్రంతా ఎదురు చూశారు. చివరికి విమానం రద్దయినట్టు అధికారులు వెల్లడించడంతో 90 శాతం మంది ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకొని టికెట్ డబ్బులను వెనక్కి తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా తరుచూ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కాగా శుక్రవారం దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ) వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావంతో దాదాపు 800 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు చెపుతున్నారు.