24-10-2025 11:07:48 AM
మనోహరాబాద్,(విజయక్రాంతి): పోలీసు అమరవీరుల స్మరణ వారోత్సవాల సందర్భంగా మెదక్ జిల్లా మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ అధికారి ఎస్‌ఐ, సిబ్బంది ఆధ్వర్యంలో జడ్ పి హెచ్ స్ కాల్లకల్ పాఠశాలలో “డ్రగ్స్ వినియోగాన్ని నివారించడంలో యువత పాత్ర మరియు సమాజంపై దాని ప్రభావం అనే అంశం పై వ్యాసరచన పోటీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఆలోచనలను ప్రతి బింబించే అద్భుతమైన వ్యాసాలు రాశారు. పోలీస్ అధికారులు విద్యార్థులకు డ్రగ్స్ వాడకానికి దూరంగా ఉండాలని, సమాజంలో సానుకూల మార్పు కోసం యువత ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో డ్రగ్ దుర్వినియోగం పట్ల అవగాహన పెంపొందించడం, సమాజంలో మత్తు రహిత వాతావరణం సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన మనోహరాబాద్ ఎస్‌ఐ, పోలీస్ సిబ్బందికి విద్యార్థులు, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.